4287) నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్నా నా సమస్తమా


** TELUGU LYRICS **

నా ప్రాణమా నా అంతరంగమా 
నాలో ఉన్నా నా సమస్తమా (2)
నాలో నీవేలా కలవపడుచున్నావు 
నాలో నీవేలా తొందరపడుచున్నావు (2)
దేవునియందు నిరీక్షణ యుంచి 
ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2)
నా ప్రాణమా నా అంతరంగమా 
నాలో ఉన్నా నా సమస్తమా (2)

లెక్కలేని అపాయములే నన్ను చుట్టుకున్నవి దేవా 
నా దోషములే నన్ను తరిమి తరిమి పట్టుకొనగా  (2)
నా తలను నేను ఎత్తుచూడలేకపోగా (2)
నా తలపైకెత్తి నిలిపిన నా దేవా (2)
దేవునియందు నిరీక్షణ యుంచి 
ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2)
నా ప్రాణమా నా అంతరంగమా 
నాలో ఉన్నా నా సమస్తమా (2)

నా ప్రాణ స్నేహితులే నన్ను విడచి దూరముపోగా 
బహునిందలతో నన్ను నిలదీయుచుండగా (2)
నా పక్షము నిలిచి నన్నాదరించితివి (2)
నా స్నేహితుడా నన్ను కాచినదేవ (2)
దేవునియందు నిరీక్షణ యుంచి 
ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2)
నా ప్రాణమా నా అంతరంగమా 
నాలో ఉన్నా నా సమస్తమా  (2)

నా బలహీనతలు చూసి నన్నందరూ వెలివేసిన 
కత్తిపోటు మాటలతో నన్ను గెలిచేసినా (2)
నా బలహీనతలు చూసి నన్ను బలపరచితివీ (2)
నా సమీపమైయుండి నిత్యము నాతో ఉండి (2)
దేవునియందు నిరీక్షణ యుంచి 
ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2)

నా ప్రాణమా నా అంతరంగమా 
నాలో ఉన్నా నా సమస్తమా (2)
నా ప్రాణమా నా అంతరంగమా 
నాలో ఉన్నా నా సమస్తమా (2)
నాలో నీవేలా కలవపడుచున్నావు 
నాలో నీవేలా తొందరపడుచున్నావు (2)
దేవునియందు నిరీక్షణ యుంచి 
ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2)
నా ప్రాణమా నా అంతరంగమా 
నాలో ఉన్నా నా సమస్తమా  (2)

----------------------------------------------------------------
CREDITS : Lyrics : Pas Isaac Paul Neppalli
Music : Bro KY Ratnam
----------------------------------------------------------------