4288) ఎవరే విడచిన నను విడువడు యేసయ్య


** TELUGU LYRICS **

ఎవరే విడచిన నను విడువడు యేసయ్య
ఎవరే మరచిన నను మరువడు యేసయ్యా  (2)
నాలో ప్రాణమై నాకు తోడున్నాడయ్య 
నన్నే విడువక నను కరుణించాడయ్య 
యేసయ్యా నా గమ్యం నీవేగా
యేసయ్యా నా మార్గం నేవేగా (2)  

తల్లి గర్భం నుండే ఒంటరిగానే వచ్చాను
తల్లితండ్రులు లేక ఒంటరిగానే మిగిలాను
లోకము నెంతో నమ్మాను
లోకులు నాకు సొంతమని
యదలోన ముళ్ళు గుచ్చిరే
అందరూ నన్ను విడచిరే  (2)
ఎవరే విడిచిన నను విడువాలేదులే
ఎవరే మరచిన నన్ను మరువాలేదులే
అమ్మా నాన్నవై నను లాలించావయ్య
కన్నా తండ్రివై నను కరుణించావయ్య
నీకై సాక్షిగా నే ఇలలో జీవిస్తా  
నీకై సాక్షిగా నే ఇలలో మరణిస్తా 
యేసయ్యా నా గమ్యం నీవేగా 
యేసయ్యా నా మార్గం నీవేగా  (2)  
||ఎవరే||

శ్రమలలో నాకు తోడుంటివి 
కృంగియున్న నన్ను హత్తుకుంటివి
బాధలలోన ఓదార్చితివి
కన్నీరు తుడచి కౌగిలించుకొంటివి
కరుణించి నన్ను కాచినా
కరుణామయుడవు నీవేగా
కడవరకు నన్ను కాయుము
నీ కౌగిలిలో దాయుము
ప్రేమా మూర్తివి ప్రేమామయుడవు
గొప్ప దేవుడా నా సర్వం నీవెగా 
పరమా తండ్రివీ పరిశుద్ధుడ నీవయ్యా
పరమా తండ్రివీ పరమాత్ముడ నీవయ్యా 
నీకై సాక్షిగా నే ఇలలో జీవిస్తా 
నీకై సాక్షిగా నే ఇలలో మరణిస్తా 
యేసయ్యా నా గమ్యం నీవేగా 
యేసయ్యా నా మార్గం నీవేగా (2)  
||ఎవరే||

-----------------------------------------------------
CREDITS : Music : Sudhakar Rella
-----------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments