4290) ఈ లోకమే ఎండమావిరా చిగురించాలంటే మార్గమే యేసురా


** TELUGU LYRICS **

ఈ లోకమే ఎండమావిరా చిగురించాలంటే మార్గమే యేసురా
ఒక్క మార్గమే యేసురా
మారు మనసు పొందు మనసును సరి చేసుకో
మనుషులందు శ్రేష్టుడిగా
ప్రభు యేసులో సాగిపో
ప్రభు యేసుతో సాగిపో
||ఈ లోకమే ఎండమావిరా||

అందరూ నీకుంటారు అన్ని తామే అంటారు
నీ కష్ట సమయమున ఎవరు నీవు పొమ్మంటారు
అలసి సొలసినా నీ హృదయం చూశాడు యేసు దేవుడు
నిను నిన్నుగ ప్రేమిస్తానని నిలిచి యున్నాడు చూడు
పిలుచుచున్నాడు నేడు
||ఈ లోకమే ఎండమావిరా||

స్వార్థ మనుషులున్నారు
కపట మోసమే చేస్తారు
సూటిపోటు మాటలాడి నీ హృదయం కాల్చుతుంటారు (2)
మానవత్వము నిజప్రేమలు లేనే లేవు ఈ లోకాన
కల్ముషం లేని ప్రేమతో పిలిచే ఆ ప్రభుని చేరరా
నీ బ్రతుకును మార్చుకొమ్మురా
||ఈ లోకమే ఎండమావిరా||

-------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------