4306) దిన దినము సన్నిధికి వస్తావమ్మా

** TELUGU LYRICS **


దిన దినము సన్నిధికి వస్తావమ్మా 
క్షణ క్షణము దేవుని వాక్యం వింటావమ్మా (2)
మనసే మారలేదు
నీ బ్రతుకే మార్చుకోవు (2) 
||దిన దినము||

ఎవరైనా ఒక్కమారు దూషిస్తే
పదె పదె దూషిస్తూ ఉంటావే
ఎవరైనా నీకు నచ్చకపోతే
బ్రతుకంతా ద్వేషిస్తూ ఉంటావే (2)
మోముపై ఊసిన 
సహియించిన క్రీస్తు ప్రేమ
దేహమంతా గాయపరిచిన 
క్షమియించిన యేసు ప్రేమ
ఏదమ్మా నీలో ఆ క్రీస్తు ప్రేమ
లేదమ్మా నీలో సహోదర ప్రేమ
||దిన దినము||

సంఘంలో శుద్ధంగా జీవిస్తావే
సమాజంలో మాదిరినీ కనుపరచవే
నీ కొరకు క్రీస్తు పొందిన గాయములు 
మాటి మాటికి రేపుచునే ఉంటావే (2)
నీ భారము మోసిన 
క్రీస్తు కాడి మోయవా
నీకై మరణించిన 
ప్రభుకై జీవించవా
ఏదమ్మా నీలో దైవ ప్రణాళిక
లేదమ్మా కొంతైనా విశ్వాసము
దిన దినము సన్నిధికి వస్తావమ్మా
క్షణ క్షణము దేవుని వాక్యం వింటావమ్మా
మనసే మార్చుకోవాలి 
నీ బ్రతుకే మాదిరవ్వాలి
ప్రేమనే నీవు పంచి 
క్రీస్తు స్వారుప్యంలో మారాలి  (2)

-------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune By : Bro.David (Srinu) 
Music & Vocals By : Danuen Nissi & Sis. Kezia
-------------------------------------------------------------------------