** TELUGU LYRICS **
అనుక్షణము నీ కృపాయే నను బలపరచుచున్నది
నిరంతరము నీ ప్రేమేయే నను నడిపించుచున్నది
నను నేను మరిచి నీతోనే నిలచి నా ఆశతీరా స్తుతించేదన్
నా ఆణువణువున నీ పేరు తలచుచు నీ భావనతో నేను నిను చేరేదన్
నిరంతరము నీ ప్రేమేయే నను నడిపించుచున్నది
నను నేను మరిచి నీతోనే నిలచి నా ఆశతీరా స్తుతించేదన్
నా ఆణువణువున నీ పేరు తలచుచు నీ భావనతో నేను నిను చేరేదన్
ఆశించి నీ చెలిమి ఆశతోడ నిను వెదకి
కనుగొంటి నీ ప్రేమ ముదమార నా పైన
అడుగడుగు నా అడుగు నీతోనే ప్రతి అడుగు
నను నడుపు తుది వరకు - నీ ప్రేమేయే (2)
నా కోసమే నీ ప్రాణమే అర్పించినవే నరరూపివై
నా పాపమే నీ త్యాగమే తుడిచచేసినే నా గతమునే
నీకే నాదు జీవమంత అర్పింతు యేసయ్య
పడిపోదునని తెలిసి ప్రేమతో బంధించి
నీ కరమునే చాచి నను నిలువబెట్టితివే
పరవశించే నా హృదయం నీ రూపునేగాంచి
నిను తాకి మరుక్షణమే సృశియించే నా తనువే (2)
ఇది చాలునే నా తనువుకే నీ రక్షణే నా కొసగునే
ఏ మిత్తునే ఈమేలుకై జీవింతును తుదిశ్వాస నీకొరకై
నీకే నాదు జీవమంత అర్పింతు యేసయ్య
-----------------------------------------------------------------------
CREDITS : Lyrics, Sung by : Rev Samuel John
Music : Jk Christopher
-----------------------------------------------------------------------