4224) యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని వేనోళ్ళ కొనియాడినా


** TELUGU LYRICS **

యేసయ్యా నీవే నాకని
వేరెవ్వరు నాకు లేరని
వేనోళ్ళ కొనియాడినా
నా ఆశలు తీరవే 
||కృప||

కృప వెంబడి కృపను పొందుచూ
కృపలో జయగీతమే పాడుచూ
కృపలో జయగీతమే పాడుచూ 

ఉన్నత ఉపదేశమందున
సత్తువగల సంఘమందున
కంచెగల తోటలోనా
నన్ను స్థిరపరచినందున 
||కృప||

సృష్టి కర్తవు నీవేనని
దైవిక స్వస్థత నీలోనని
నా జనులు ఇక ఎన్నడు
సిగ్గు పడరంటివే
||కృప||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------