4222) స్తుతి గానమా నా యేసయ్యా నీ త్యాగమే నా ధ్యానము


** TELUGU LYRICS **

స్తుతి గానమా - నా యేసయ్యా
నీ త్యాగమే - నా ధ్యానము
నీ కోసమే - నా శేష జీవితం
||స్తుతి||

నా హీన స్థితి చూచి
నా రక్షణ శృంగమై
నా సన్నిధి నీ తోడని
నను ధైర్యపరచినా... నా నజరేయుడా
||స్తుతి||

నీ కృప పొందుటకు
ఏ యోగ్యత లేకున్నను
నీ నామ ఘనతకే నా
శాశ్వత నీ కృపతో... నన్ను నింపితివా
||స్తుతి||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------