** TELUGU LYRICS **
సిలువలో - వ్రేలాడే నీ కొరకే
యేసు నిన్ను - పిలచుచుండె - ఆలస్యము నీవు చేయకుము
యేసు నిన్ను - పిలచుచుండె - ఆలస్యము నీవు చేయకుము
కల్వరి శ్రమలన్ని నీ కొరకే - ఘోర సిలువ మోసే క్రుంగుచునే
గాయములాచే బాధనొంది - రక్తము కార్చి హింస నొంది
||సిలువ||
నాలుక యెండెను దప్పిగొని - కేకలు వేసెను దాహమని
చేదు రసమును పానము చేసి - చేసెను జీవయాగమును
||సిలువ||
అగాధ సముద్ర జలములైనా - ఈ ప్రేమను ఆర్పజాలవుగా
ఈ ప్రేమ నీకై విలపించుచూ - ప్రాణము ధారా బోయుచునే
||సిలువ||
-------------------------------------------------------------------------
CREDITS : Hosanna Ministries (హోసన్నా మినిస్ట్రీస్)
Album (34) : Nityatejuda (నిత్యతేజుడా)
Youtube Link : 👉 Click Here
-------------------------------------------------------------------------