4217) ఆదరణ కర్తవు అనాధునిగ విడువవు నీ తోడు నాకుండగా


** TELUGU LYRICS **

ఆదరణ కర్తవు - అనాధునిగ విడువవు
నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు 

అల్పుడనైయున్న నన్ను చేరదిసితివా
అనాది నీ ప్రేమయే - నన్నెంతో బలపరచెనే
ఆనంద భరితుడనై - వేచియుందును నీరాకకై  
||ఆదరణ||

నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే
నీ కృపాదానమే - నన్నిలలో నిలిపెనే
నీ నిత్య కృపలోనే - నన్ను స్థిరపరచు కడవరకు
||ఆదరణ||

యేసయ్యా! యేసయ్యా !!
యేసయ్యా ! యేసయ్యా !!

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------