4216) నా ప్రాణ ఆత్మ శరీరం అంకితం నీకే ప్రభూ అంకితం నీకే ప్రభూ


** TELUGU LYRICS **

నా ప్రాణ ఆత్మ శరీరం - అంకితం నీకే ప్రభూ
అంకితం నీకే ప్రభూ

పాపపు ఊబిలో మరణించిన నన్ను - పరమందు చేర్చుటకు
ప్రాణమిచ్చి నన్ను రక్షించినా - ప్రేమను మరువలేను
నీ కృపను మరువలేను 
 
||నా ప్రాణ||

నన్ను నీ వలె మార్చుటకేగా ఆత్మతో నింపితివి
ఆత్మతో సత్యముతో ఆరాధించి
ఆనంద ప్రవాహముతో నీదరి చేరెదను
||నా ప్రాణ||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------