4262) ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మతో సత్యముతో నీకే ఆరాధన


** TELUGU LYRICS **

    ఆరాధన స్తుతి ఆరాధన
    ఆత్మతో సత్యముతో నీకే ఆరాధన
    తండ్రియైన దేవా కుమారుడైన ప్రభువా పరిశుద్ధాత్మ దేవ 
    త్రియేక దేవా ఆరాధన స్తుతి ఆరాధన

    సర్వసృష్టికి ఆధారుడా సకలజీవుల పోషకుడా
    సీయోనులోనుండి దీవించువాడవు
    సదాకాలము జీవించువాడవు
    సాగిలపడినే నమస్కరించి
    సర్వదా నిను కొనియాడెద నిన్నే కీర్తించెద
    ||తండ్రియైన||

    సార్వాత్రిక సంఘాస్థాపకుడా సర్వలోక రక్షకుడా
    సిలువలో నీరక్తమే నాకై కార్చితివి
    శిథిలముకాని నగరమును కట్టితివి
    స్తోత్రము చెల్లింతు నీకీర్తి తలచి
    సర్వలోకాన నీమహిమను నేను ప్రకటింతును 
    ||తండ్రియైన||

    సర్వసత్యమునకు ఆధారమై పరిశుద్ధయాజకుల సారాధివై
    యాజక రాజ్యములో నను చేర్చుటకై 
    నిత్యయాజకత్వమును ధరింపజేసితివి
    మహిమతో పరిచార్య నే చేయుటకై
    నూతన కృపలను నేపొందెద ఆత్మశక్తితో సాగేద 
    ||తండ్రియైన||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments