4202) యేసయ్య ప్రేమ నన్ను మార్చినది ఆ ప్రేమకు నేను బంధినైపోయాను


** TELUGU LYRICS **

    యేసయ్య ప్రేమ నన్ను మార్చినది
    ఆ ప్రేమకు నేను బంధినైపోయాను (2)
    చీకటైనా నా జీవితాన్ని ఉదయింపజేసెను
    ఒంటరైన నా జీవితానికి అండగా నిలిచెను (2)
    ఏమివ్వగలనయ్య నిజమైన ప్రేమకు (2)
    ఆరాధింతును ఆరాధింతును (2)
    నా పూర్ణ  ఆత్మతో యేసయ్యాను నా పూర్ణ బలముతో (2)

1.  ఈ లోక ప్రేమలన్ని మరణించు వరకు
    ఈ లోక బంధాల్ని కొద్దికాలమే కదా (2)
    యేసయ్య ప్రేమ శాశ్వతమైనది (2)
    మరణము నొందిన వీడని ప్రేమది (2)

2.  నిజమైన ప్రేమికుడు నా మంచి యేసయ్యా 
    నాకంటే ముందుగా నన్ను ప్రేమించెను (2)
    పాపినైన నా కొరకు ప్రాణాన్ని అర్పించి (2)
    నిజమైన ప్రేమకు అర్థము తెలిపిన (2)

3.  అపరాధములు చేత నేను చచ్చియుండగా
    ప్రేమ చేతనే నన్ను రక్షించెను (2)
    కల్వరిలో నాకొరకు శిక్షను భారించి (2)
    అరచేతిలో నన్ను చెక్కుకున ప్రేమది (2)

---------------------------------------------------------
CREDITS : Music : Bro Danuen Nissi 
Lyrics: Bro Joseph Gunturu
---------------------------------------------------------