4210) ఏనాడు ఎవ్వరు నీలాంటి ప్రేమను చూపించలేదే ఈ జగతిలో

    

** TELUGU LYRICS **

    ఏనాడు ఎవ్వరు - నీలాంటి ప్రేమను
    చూపించలేదే - ఈ జగతిలో (2)
    ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్య
    సిలువలో నా కోసం బలియై పోతివయా (2)

1.  భరియింపజాలని - నా పాప భారముకై
    సిలువనే మోయుచు - సోమ్మసిల్లి పోతివే (2)
    కొరడాలు చెళ్ళని దేహాన్ని చీల్చినా(2)
    భరియించినావయ్యా - ప్రేమా మయా(2)
    ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్య
    సిలువలో నా కోసం బలియై పోతివయా (2)
    ఏనాడు ఎవ్వరు - నీలాంటి ప్రేమను
    చూపించ లేదే - ఈ జగతిలో

2.  వేవేల దూతలతో - దివినేలు రాజువై
    నను బ్రోవ ప్రేమతో - ధరకేగి దీనుడవై (2)
    సొగసైన నీ రూపం కోల్పోయి నా కోసం(2)
    మరణించినావయ్యా కరుణామయా (2)
    ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్య
    సిలువలో నా కోసం బలియై పోతివయా (2)
    ఏనాడు ఎవ్వరు - నీలాంటి ప్రేమను
    చూపించ లేదే - ఈ జగతిలో

3.  నీ రాజ్య పౌరునిగా - వారసత్వ మిచ్చుటకై
    చిందించి నీ రుధిరం - రక్షించినావయ్యా (2)
    ఏమిచ్చి నీ ఋణం  నే తీర్చగలనయ్యా(2)
    అర్పింతునయ్యా నా జీవితం (2)
    ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్య
    సిలువలో నా కోసం బలియై పోతివయా (2)
    ఏనాడు ఎవ్వరు - నీలాంటి ప్రేమను
    చూపించ లేదే - ఈ జగతిలో    

-------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------