4211) నీ కన్నీరు తుడుచుటకు బాధలన్నీ బాపుటకు


** TELUGU LYRICS **

నీ కన్నీరు తుడుచుటకు బాధలన్నీ బాపుటకు 
శిక్షను తొలగించుటకు రక్షణనే ఇచ్చుటకు 
సిలువలో వ్రేలాడిన యేసును చూసావా
ఆయన చేసిన త్యాగాన్ని మరిచావా 
ఓ... ప్రియ నేస్తమా! కళ్ళు తెరుచుకో... క్రీస్తు సంఘమా!

సారెపతులో విధవరాలిని కరువులోన  పోషించెగదా  
దానియేలునకు సింహపు బోనులో తోడుగుండి విడిపించె గదా 
శ్రమలలో ఇబ్బందులలో కాపాడే దేవుడు నీకుండగా 
విశ్వాసముతో ప్రార్ధిస్తే ఆ దేవుడే రాడా నీ అండగా  

నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తని పలికిన పౌలులా ఉన్నావా
వంచన చేసి యేసునే అమ్మిన ఇస్కరియోతులా ఉన్నావా 
క్రీస్తును పోలి నడచుకొనుటయే మన అందరి కర్తవ్యమురా
అంతా నా ఇష్టమే అని తలచితే
నీ బ్రతుకే ఇక వ్యర్ధమురా

----------------------------------------------------------------------------------------
CREDITS : Music: Bro. Amruth Korati
Lyrics & Vocals : Bro. M. Anand Kumar & Bro. Nissy John
----------------------------------------------------------------------------------------