4206) తాలిమే చూపినావు త్రోవతప్పిన నాపై త్యాగమే చేసినావు యేసయ్య కొరకై


** TELUGU LYRICS **

తాలిమే చూపినావు త్రోవతప్పిన నాపై
త్యాగమే చేసినావు యేసయ్య కొరకై (2)

నేనంటే నీకు ఎందుకింత ప్రేమయ్యా
నాపైన నీకు ఇంత జాలి ఎందుకయ్యా (2)

నీ శిలువ త్యాగమే యేసయ్య నిను చేరుటకు 
నా జీవితానికి వారధి ఆయెను 
నీ తనువుచీల్చబడెను పాపపుతెర తొలగిపోయేను 
నీతో స్నేహమే నాకు దొరికేను (2)
నీతిమంతునిగా నను తీర్చుటకు  
నా దుర్నీతినే నీవు ధరియించితివి 
నీదు పరిశుద్ధతను నాక్కిచ్చుటకు 
నా పాపమే  భరియించితివి 
||నేనంటే నీకు||

నిర్థోషమైన నీ రక్తము నాకొరకు చిందిం పబడెను ఆ కల్వరిలో 
నిర్జీవమైన నా క్రియలను విడచుటకు 
నీ రక్త ధారలే నాకు మార్గములాయెను (2)
జీవముగల నిన్ను సేవించుటకు 
మనస్సాక్షినే శుద్ధిచేసితివి. 
నీ నిత్య స్వాస్థ్యమును నాకిచ్చుటకు 
నీ నిబంధనను స్థిరపరచితివి 
||నేనంటే నీకు|| 

--------------------------------------------------------------------------------
CREDITS : Lyric & Tune : Bro. Sangeeth 
Music & Vocals : Bro KJW Prem & Bro. Nissy John
--------------------------------------------------------------------------------