4207) కన్నీటి పర్యంతము ఆ నిమిషం కలవరమే ప్రతి గుండెలో ఆ క్షణం

    

** TELUGU LYRICS **

    కన్నీటి పర్యంతము ఆ నిమిషం
    కలవరమే ప్రతి గుండెలో ఆ క్షణం
    చూడలేక కొందరు చూసి మరికొందరు
    సత్యాన్ని తప్పించి స్వార్థానికి చోటిచ్చి
    అవమానపరిచినారు నిన్ను 
    అవహేళన చేసినారు నిన్ను

1.  బంధాలే కనుమరుగు ఆ సమయాన
    మనస్సాక్షి మరుగుపడిన ఆ స్థితిలోనా 
    లెక్కింప లేని మేలులెన్నో చేసినా
    లెక్క తప్పిపోకుండా కొరడాలతో కొట్టిరి
    శిరముపై ముళ్ళు గుచ్చి నిన్ను అపహసించిరి

2.  స్వస్థతలెన్నో చేసిన ఆ చేతులలో
    వెలుగుకు నడిపిస్తున్న ఆ పాదాలలో
    పదునైన మేకులతో సిలువకు నిన్ను కొట్టి
    కరుణ లేని ముష్కరులు సిలువ వేసినారు
    ప్రక్కలోన బళ్ళెమును గ్రక్కునదించారు

3.  వీరిని క్షమియించుమని తండ్రిని వేడితివి
    బంధాలు బాధ్యతలు  గుర్తు చేసితివి
    ప్రేమను మించినది లేదని నీవె తెలిపితివి
    ఆ ప్రేమను సిలువలో నీవే చూపించితివి
    తండ్రి చిత్తమునకు నిన్ను అప్పగించుకొంటివి

-------------------------------------------------------
CREDITS : Singer :Anjana Sowmya
Lyricist : P. Naveen Kumar
-------------------------------------------------------