** TELUGU LYRICS **
దాహం వేస్తున్నా
దారంత రక్తమైన
ఆగలేదు ఎందుకు
గాయం బాధిస్తున్నా
గమ్యం నేనంటూ
గుండెనిండ నాపైన
ఇంతప్రేమ ఎందుకు
కరుణ చూపే నీకు కఠోర శ్రమ ఇప్పుడు
కలిగింది నా వలనే కాదనలేను
రమ్యమైన నీ మోముపై రవ్వంత జాలి లేక
పిడి గుద్దులు గుద్దిన పాపిని నేను
కనబడుతున్నది నీ త్యాగం ప్రాణం పోతున్నా ఆపని ఆ బలియాగం
ప్రాణం పోతున్నా ఆపని ఆ బలియాగం
ఎంతో ఆశగా చేసుకున్నావు నన్ను
అంతే అలుసుగా తీసి వేసినాను నిన్ను
నీ కంటిపాపలా చూసుకున్నావు నన్ను
నీ కన్నీటికి కారణం నేను
అందని ఆకాశమందు అందాల రాజువు
అక్కరకే రాను కదా అవనికి దిగి వచ్చితివా
కనబడుతున్నదినీ త్యాగం ప్రాణం పోతున్నా ఆపని ఆ బలియాగం
ప్రాణం పోతున్నా ఆపని ఆ బలియాగం
ఎన్నోమారులు క్షమియిoచినావు నన్ను
మారని నా బ్రతుకు సిలువ వేసింది నిన్ను
ఎంతో ఓర్పుతో సహియిoచినావు నన్ను
ఈ లోక ఆశలతో నే మరిచితి నిన్ను
నరకపు కూపములొ నే వేదన పడలేనని
దేవా నీవే నరుడై బలియాగమైతివా
వినబడుతున్నది నీ ప్రేమ నినాదం
విడువను ఎడబాయనన్న చిరకాల వాగ్దానం
దారంత రక్తమైన
ఆగలేదు ఎందుకు
గాయం బాధిస్తున్నా
గమ్యం నేనంటూ
గుండెనిండ నాపైన
ఇంతప్రేమ ఎందుకు
కరుణ చూపే నీకు కఠోర శ్రమ ఇప్పుడు
కలిగింది నా వలనే కాదనలేను
రమ్యమైన నీ మోముపై రవ్వంత జాలి లేక
పిడి గుద్దులు గుద్దిన పాపిని నేను
కనబడుతున్నది నీ త్యాగం ప్రాణం పోతున్నా ఆపని ఆ బలియాగం
ప్రాణం పోతున్నా ఆపని ఆ బలియాగం
ఎంతో ఆశగా చేసుకున్నావు నన్ను
అంతే అలుసుగా తీసి వేసినాను నిన్ను
నీ కంటిపాపలా చూసుకున్నావు నన్ను
నీ కన్నీటికి కారణం నేను
అందని ఆకాశమందు అందాల రాజువు
అక్కరకే రాను కదా అవనికి దిగి వచ్చితివా
కనబడుతున్నదినీ త్యాగం ప్రాణం పోతున్నా ఆపని ఆ బలియాగం
ప్రాణం పోతున్నా ఆపని ఆ బలియాగం
ఎన్నోమారులు క్షమియిoచినావు నన్ను
మారని నా బ్రతుకు సిలువ వేసింది నిన్ను
ఎంతో ఓర్పుతో సహియిoచినావు నన్ను
ఈ లోక ఆశలతో నే మరిచితి నిన్ను
నరకపు కూపములొ నే వేదన పడలేనని
దేవా నీవే నరుడై బలియాగమైతివా
వినబడుతున్నది నీ ప్రేమ నినాదం
విడువను ఎడబాయనన్న చిరకాల వాగ్దానం
---------------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Bro Timothy Vemulapalli
Music & Vocals : Bro. KJW Prem & Bro. Nissy John
---------------------------------------------------------------------------------