4204) నీవంటి ప్రేమ నీవంటి కృపా నేను చూడలేదయా నేను చూడలేనయా


** TELUGU LYRICS **

నీవంటి ప్రేమ నీవంటి కృపా 
నేను చూడలేదయా నేను చూడలేనయా
యేసయ్యా నీవంటి త్యాగం నీవంటి కరుణా
ఎన్నడు చూడలేదయ ఎక్కడ కానరాదయ

యేసయ్యా నీవంటి ప్రేమా నేను చూడలేదయ నేను చూడలేనయా
యేసయ్య నీవంటి కృపా ఎవ్వరు చూపలేదయ ఎవ్వరు చూపలేరయ

నీవంటి ప్రేమ నీవంటి కృపా 
నేను చూడలేధయా నేను చూడలేనయా
యేసయ్యా నీవంటి త్యాగం నీవంటి కరుణా
ఎన్నడు చూడలేదయ ఎక్కడ కానరాదయ

దేనికి యోగ్యత లేని నాకై పరమునుండి భువికి దిగివచ్చితివే 
నీ రక్తములో నను కడిగి నన్ను నీ రాజ్యమునకు చేర్చితివే
యేసయ్యా నీవంటి త్యాగం నేను చూడలేధయ నేను చూడలేనయ 
యేసయ్యా నీవంటి కరుణా ఎన్నడు చూడలేదయ ఎక్కడ కానరాదయ
||నీవంటి  ప్రేమ||

పాపములో పడి ఉన్న నన్ను నీ కృపాతో లేవనెత్తావు
నే నశించుట ఇష్టము లేక నా బదులుగా నీవు బలి అయితివే
యేసయ్యా నీవంటి కృపా నేను చూడలేదయ నేను చూడలేనయ 
యేసయ్యా నీవంటి  ప్రేమా ఎన్నడు చూడలేదయ ఎక్కడ కానరాదయ
||నీవంటి  ప్రేమ||

బలహీనమైన నన్ను నీ ఆత్మతో బలపరిచావు
నీ ప్రేమను ప్రకటించుచు నా పాపములను భరించావు
యేసయ్యా నీవంటి ప్రేమా నేను చూడలేదయ నేను చూడలేనయ 
యేసయ్యా నీవంటి కృపా ఎన్నడు చూడలేదయ ఎక్కడ కానరాదయ
||నీవంటి  ప్రేమ||

---------------------------------------------------------------------------------
CREDITS : Music & Tune : KY Ratnam
Lyrics & Vocals : Arun Earpula & Surya & KY Ratnam
---------------------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments