4168) చేరి జీవించుడి దేవాది దేవుని చేరి జీవించుడి


** TELUGU LYRICS **

చేరి జీవించుడి 
దేవాది దేవుని 
చేరి జీవించుడి
చేరి జీవనము చేసిన యెడల
కోరిన మోక్షము ఊరకే దొరుకును 

మంచినే చేయుడి
దానినే అనుసరించి జీవించుడి
మంచి మార్గమున ఆటంకములు
మాటి మాటికి వచ్చును గాని
కించితైనను మంచిని గూర్చి 
వంచన దారి యటంచు తలంపక
మంచి చెడ్డలన్ గుర్తింపగల 
మనసాక్షిని ఇమ్మని దేవుని
యెంచి ప్రార్ధన చేయుచు స్తుతితో

పాపముల్ మానుడి
ఆ చెడ్డదారివైపే చూడకుడి
పాపము పాప ఫలితమైయున్న
శాపము సాతాన్ అతని సైన్యము 
చూపునకెంతో రమ్యములైన 
ఆపదలును ఆ పాప మార్గమున
దాపరించియుండును కావున 
దాపున జేరిన అది నరకంబను
కూపములోనికి నడుపును గాన 

-----------------------------------------------------------------------------
CREDITS : Album : Srastha - 1
Music & Vocals : Jonah Samuel & Karthik
Lyrics & Composition : Shri. Devadas Mungamuri
-----------------------------------------------------------------------------