** TELUGU LYRICS **
యేసు జన్మించెన్ - పాపుల
కొరకును శుద్ధులకొరకును - యేసు జన్మించెన్
ఈ సంతసమగు వర్తమానము - ఎల్లజనుల వీనులమ్రోగు
గాక - విభునకు స్తోత్రము
కొరకును శుద్ధులకొరకును - యేసు జన్మించెన్
ఈ సంతసమగు వర్తమానము - ఎల్లజనుల వీనులమ్రోగు
గాక - విభునకు స్తోత్రము
||యేసు||
లోకము కొరకును నాకై నీకై ఆ కాలమునకై - ఈ కాలమునకై -
లోకరక్షకుడగు యేసుడు బుట్టెను - ఆ కైసరౌగుస్తు అరయలేదు
ప్రభున్ = ఇది ఆశ్చర్యము - ఎంతో విచారము - ఏల నతడు
ప్రభు - నెరుగకపోయెనో
||యేసు||
భూజనాంగములకై నాకై నీకె - రాజులకై హే - రోదురాజు
కొరకై - రాజగు యేసుడు - రంజిల్ల బుట్టెను - రాజగు హేరోదు
ప్రభువు నరయలేదు = ఇది ఆశ్చర్యము - ఎంతో విచారము -
యేల నతడు ప్రభు నెరుగకపోయెనో
||యేసు||
సర్వలోకమునకై నాకై - నీకె - సర్వవేదజ్ఞులౌ - శాస్త్రుల కొరకై
ఉర్విని యేసుడు - ఉద్భవించెను - గర్వపు శాస్త్రులు ప్రభువు
నరయలేదు = ఇది ఆశ్చర్యము - ఎంతో విచారము యేల వారు
ప్రభు - నెరుగకపోయిరో
||యేసు||
నీవనుకొను ప్రతివానికై నాకై నీకై - దేవార్చకులకై - శాస్త్రుల
కొరకై - దేవనందనుడి భువిలో - బుట్టెను - ఈ వార్తచూసి
యేల వారు ప్రభు - నెరుగకపోయిరో
||యేసు||
ఆ ప్రాంతపు వారికి జ్ఞానులకు - ఈ ప్రభుజన్మసు - వార్తవిన
బడియె-భూ ప్రజలీవార్త - గ్రహింపలేదాయె అ ప్రజలకు చూచు -
నాశయె లేదాయె = ఇది ఆశ్చర్యము - ఎంతో విచారము - ఎందులకీ
వార్త - యెరుగకపోయిరో
||యేసు||
సకల మతస్థులకొరకై నాకై - సుఖముగా జీవించు - నీ కొరకై ప్రభు
సుఖమును త్యజించి - సుతుడై పుట్టెను - సకల మతస్థులు - స్వామి
నెరుగలేదు = ఇది ఆశ్చర్యము ఎంత విచారము - యేల వారు ప్రభు
నెరుగక పోయిరో
||యేసు||
అన్ని పల్లెలకై పట్టణములకై - కన్నబిడ్డలమగు - నాకై నీకై
చిన్న కుమారుడై - శ్రీ యేసుబుట్టెను - అన్నిచోట్లకిపుడీ - వార్త
తెలియుచుండెన్ - ఇది ఆశ్చర్యము - ఎంతో సంతోషము -
ఇట్లు వ్యాపింపజేయు - దేవునికి స్తోత్రము
||యేసు||
-------------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------------