4121) వెదకినా ఎంత వెదకినా దొరకని ప్రేమే దొరికితే

    
** TELUGU LYRICS **
    
    వెదకినా ఎంత వెదకినా దొరకని ప్రేమే దొరికితే
    ఎరిగినా ఎరుగక పోయినా యేసుడే నన్ను చేరగ
    పట్టలేని పరవశమే నన్ను చుట్టు ముట్టేనే
    వింత అయిన ఆనందం నాలో పొంగి పొర్లేనే (2)
    యేమియ్యగలను - నా యేసు ప్రేమ తలచి
    ఏం చేయగలను - ప్రియ యేసు నిన్ను విడచి
 (2)

    తల్లి గర్భమునకు ముందే నన్ను రూపించినావుగా
    ఆకాశమంత ప్రేమ చూపినావుగా
    మిన్నల్లి నైనా నన్ను హెచ్చించినావుగా 
    మంచి పాత్రగా మలచినావులే
    నన్ను నీదు బిడ్డగా చేర్చుకొంటివే
    ఇదే వరమై నా జీవితాన సాగనీ 
    నీలో వశమై సీయోను పురము చేరనీ
   
    ||వెదకినా||

    దావీదు వంటి రచన నాకు లేకపోయిన
    వింతైన అనుభవాలు ఇచ్చినావుగా
    కొండంత ధైర్యముతో నన్ను నింపినావులే
    ఆరాధనే నాకు భాగ్యము
    ఈ ఆలాపనే నీకు ధూపము 
    ఇదే వరమై నా జీవితాన సాగనీ 
    నీలో వశమై సీయోను పురము చేరనీ 
    ||వెదకినా||

-------------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------------