4120) రాజువైన నా దేవా రారాజువైన యేసయ్య


** TELUGU LYRICS **

రాజువైన నా దేవా
రారాజువైన యేసయ్య (2)
కోటి స్వరముల స్తుతించిన
 (2)
తనివి తీరదు నా మనసున
 (2)
ఆరాధన స్తుతి ఆరాధన (6)
||రాజవైన||

కృప చూపుటలో శ్రీమంతుడా
తరతరములకు ఆరాధ్యుడా
 (2)
షాలేము రాజా నా యేసయ్య 
స్తుతి ఘనత నా మహిమ నీకేనయ
 (2)
||రాజవైన||

నను గెలిచినది నీ త్యాగము
నడిపించినది ఉపదేశము
 (2)
యేసయ్య నీ సంకల్పము
నెరవేర్చుటయే నా భారము
 (2)
||రాజవైన||

మరణమె లేనిది నీ రాజ్యము
మహిమోన్నతమైన ఆ దేశము
 (2)
యేసయ్య నీ ఘన నామము
మారుమ్రోగునె ప్రతినిత్యము
 (2)
||రాజవైన||

-------------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------------