** TELUGU LYRICS **
మాకు జన్మనిచ్చావు - నీలో జతపరిచావు
మాకు బ్రతుకు నిచ్చావు - నీలో బలపరిచావు (2)
నీ ఉన్నతమైన పిలుపునకు - అర్హులుగా చేశావు
నీ అమూల్యమైన సేవను చేయ భాగ్యమునుఇచ్చావు (2)
అ.ప: మహిమ నీకే - ఘనత నీకే
స్తుతులు నీకే - మా సర్వము నీకే దేవా (2)
మాకు బ్రతుకు నిచ్చావు - నీలో బలపరిచావు (2)
నీ ఉన్నతమైన పిలుపునకు - అర్హులుగా చేశావు
నీ అమూల్యమైన సేవను చేయ భాగ్యమునుఇచ్చావు (2)
అ.ప: మహిమ నీకే - ఘనత నీకే
స్తుతులు నీకే - మా సర్వము నీకే దేవా (2)
కుటుంబాలు వేరైనా - మమ్మును ఐక్యపరిచి
నీ సంకల్పమునే మాలో నెరవేర్చుచున్నావు
ప్రాంతాలు వేరైనా - నీ చిత్తమైన స్థలమున చేర్చి
దివ్యమైన పరిచర్య - జరిగించుచున్నావు (2)
మరువమయా నీవు మాయెడ చేసిన మేలులన్నిటిని
నెరవేర్తుమయా నీవు మా యెడ కలిగిన ఆశలన్నిటిని (2)
||మహిమ నీకే||
మా జీవితాలను ఆశీర్వదించావు -
మా జీవితాలను ఆశీర్వదించావు -
అనేకులకు దీవెనగా ఉండ భాగ్యం ఇచ్చావు
మేము ఉన్నంత కాలం - నీ కాడి మోయుచు
మేము ఉన్నంత కాలం - నీ కాడి మోయుచు
ఒకరినొకరు ప్రోత్సాహంతో నిన్ను పోలి నడిచెదమ్ (2)
ఆత్మీయమైన - ప్రేమను పంచే కుటుంబమునిచ్చావు
ఈ మా కుటుంబము ద్వారా ఎల్లప్పుడూ - మహిమ కలుగును గాక!
ఆత్మీయమైన - ప్రేమను పంచే సంఘమును ఇచ్చావు
ఈ మా సంఘము ద్వారా ఎల్లప్పుడూ మహిమ కలుగు గాక!
ఆత్మీయమైన - ప్రేమను పంచే కుటుంబమునిచ్చావు
ఈ మా కుటుంబము ద్వారా ఎల్లప్పుడూ - మహిమ కలుగును గాక!
ఆత్మీయమైన - ప్రేమను పంచే సంఘమును ఇచ్చావు
ఈ మా సంఘము ద్వారా ఎల్లప్పుడూ మహిమ కలుగు గాక!
నీకే మహిమ కలుగును గాక!
||మహిమ నీకే||
-------------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------------