4118) స్తుతించుచు పాడెదను నీవు చేసిన మేలులను

    
** TELUGU LYRICS **

    స్తుతించుచు పాడెదను - నీవు చేసిన మేలులను
    తలంచుచు నే సాగేదన్ - నా స్తుతులపై ఆసీనుడా (2)
    నీ కృప నాకు చాలని - నిను కొనియాడెదను
    నీ ప్రేమనే నేను తలపోయుచు - ఇల జీవించెదను
 (2)           
    చాలయ్యా నీ కృప - చాలయ్యా నీ కృప
 (2)
                                             
    నిరంతరం ప్రతీ క్షణం కాపాడు దేవా 
    ఎత్తయిన శిఖరమల్లే నన్ను నిలిపే ప్రభువా
 (2)
    నీ నామమెంత గొప్పదయ్యా రాజా  
    నిను స్తుతించిన చాలును యేసయ్యా (4)
    చాలయ్యా నీ కృప - చాలయ్యా నీ కృప
 (2)
                                             
    ఏ తెగులు రాకుండ నన్ను కాచినావు  
    అన్నివేళలందు నాకు అండగ నిలిచావు
 (2)
    ఉన్నతమైనదయ్యా నీదు ప్రేమా 
    నిను కీర్తించిన చాలును యేసయ్యా
 (4)
    చాలయ్యా నీ కృప - చాలయ్యా నీ కృప
 (2)

-------------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------------