4123) సర్వాధీశుడా! నీవేగ నను సంతోషముతో నింపినది

    
** TELUGU LYRICS **

    సర్వాధీశుడా! నీవేగ నను
    సంతోషముతో నింపినది
    సజీవమైన బలము - సమృధిగల జీవజలము
    సద్భక్తియే ప్రతిఫలము - శ్రీ యేసు నీ పదస్థలము

    మహిమగల - మహారాజువు నీవు
    మహిమను మీటిన - మంటిని నేను
    ఆహా! ఆహా! ఎంతో సంతోషం
    ఓహో! ఓహో! ఎంతో ఆనందం
    మహిమగ మనిషిని మార్చుటకు
    మహోన్నతునిగ - మహి చేరితివి  
    ||సర్వాధీశుడా||

    సహనముగల - సహసాక్షివి నీవు
    సహన శిక్షణకై - శిష్యడ నేను
    ఆహా! ఆహా! నీదే సాత్వీకం
    ఓహో! ఓహో! నీదే దీనత్వం
    సహనపు సొగసును సలుపుటకు
    సహోదరునిగ - సృహ చాటితివి
  
    ||సర్వాధీశుడా||

    దేవుని దూతవు  - దైవము నీవు
    దేవుని ధ్వనికై - దాసుడ నేను
    ఆహా! ఆహా! అదియే నా స్వప్నం
    ఓహో! ఓహో! అదియే నా ధ్యానం
    దేవుని దానమై దీనులకు
    దేవుని తోడుగ - దరి చేరితివి
    ||సర్వాధీశుడా||

-------------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------------