4126) నీవు ఉన్నావని నేను ఉన్నానయ్యా నడిపిస్తావని నేను నడిచానయ్యా

    
** TELUGU LYRICS **

    నీవు ఉన్నావని నేను ఉన్నానయ్యా 
    నడిపిస్తావని నేను నడిచానయ్యా (2)
    నా చేయి విడువకు యేసయ్య
    నీవు లేకుండా నేను ఉండలేనయ్య 
 (2)

    షద్రకు, మేషాకు, అబేద్నగోలను
    అగ్ని గుండములో పడవేయగా
 (2)
    నీవు ఉన్నావయ్యా ఆదుకున్నావయ్యా (2)
    నా ధైర్యము నీవే యేసయ్యా
    నా బలము నీవే యేసయ్యా
 (2)  
    ||నీవున్నవని||

    దానియేలు ప్రార్ధన చేయగా
    సింహాల బోనులో పడవేయగా

    నీవు ఉన్నావయ్యా ఆదుకున్న వయ్య
 (2)
    నా ధైర్యము నీవే యేసయ్యా
    నా బలము నీవే యేసయ్యా
 (2)
    ||నీవున్నవని||

    పేతురు చెరసాలలో  వేయబడగా
    సంఘమంతా ప్రార్ధన చేయగా
 (2)
    నీవు ఉన్నావయ్యా ఆదుకున్నావయ్య
 (2)
    నా ధైర్యము నీవే యేసయ్యా
    నా బలము నీవే యేసయ్యా 
    ||నీవున్నవని||

-------------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------------