** TELUGU LYRICS **
జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు
జగములనేలే మహిమాన్వితుడా - నా యెడ నీ కృపను
జాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను
ఏమని పాడెదనూ - ఏమని పొగడెదను
జగములనేలే మహిమాన్వితుడా - నా యెడ నీ కృపను
జాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను
ఏమని పాడెదనూ - ఏమని పొగడెదను
||జీవప్రదాతవు||
శుభకరమైన తొలి ప్రేమనునే - మరువక జీవింప కృపనీయ్యవా (2)
కోవెలలోని కానుక నేనై - కోరికలోని వేడుక నీవై
జతకలిసి నిలిచి - జీవింపదలచి కార్చితివి నీ రుధిరమే
నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా
||జీవప్రదాతవు||
నేనేమైయున్న నీ కృపకాదా - నాతో నీ సన్నిధిని పంపవా (2)
ప్రతికూలతలు శృతిమించినను - సంధ్యా కాంతులు నిదురించినను
తొలి వెలుగు నీవై - ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా
నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్యా
||జీవప్రదాతవు||
మహిమను ధరించిన యోధులతో కలసి - దిగి వచ్చెదవు నా కోసమే (2)
వేల్పులలోన బహుఘనుడవు నీవు - విజయ విహారుల ఆరాధ్యుడవు
విజయోత్సవముతో - ఆరాధించెదను అభిషక్తుడవు నీవని
ఏనాడూ పొందని ఆత్మాభిషేకముతో నింపుము నా యేసయ్యా
||జీవప్రదాతవు||
--------------------------------------------------------------------------
CREDITS : Hosanna Ministries (హోసన్నా మినిస్ట్రీస్)
Album : Adviteeyudaa (అద్వితీయుడా)
--------------------------------------------------------------------------