4160) జీవ గ్రంథంలో నా ఆ నామాన్ని తన రక్తముతో లిఖించిన


** TELUGU LYRICS **

జీవ గ్రంథంలో నా ఆ నామాన్ని తన రక్తముతో లిఖించిన 
యేసునిలో నాకు ఆనందం యేసునిలో నాకు ఘనవిజయం (2)
భూమిపై నేనేమి విప్పుదునో అవి అన్ని పరమునందున కూడ విప్పబడునులే 
భూమిపై నేనేమి బంధించి ఉంచుదునో పరమునందున అవి బంధింపబడునులే 
||భూమిపై|| 

అవిధేయతతో నేను కోల్పోయిన దేవుని వారసత్వమును 
తన రక్తముతో నాకు అందించెను యేసుడు నా రక్షకుడు 
విలువైన తన సొత్తుగా నను చేసి తన పరిశుద్ధాత్మతో నను నింపి 
శత్రువు క్రియలన్నిటిపై నాకు జయమునిచ్చినట్టి
యేసు ప్రభునకే స్తోత్రం స్తోత్రం
||భూమిపై|| 

నేనడుగుపెట్టె ప్రతి స్థలమును యేసుని స్వాస్థ్యము చేసెదను 
నను ప్రేమించెడి యేసునిలో అత్యధిక విజయం పొందెదను 
ప్రభువైపుకు అనేకులన్ త్రిప్పి ఆకాశ జ్యోతినై మెరిసెదను 
నిత్యం జయోత్సవముతో నన్ను నిలబెట్టుచున్న 
యేసు నా ప్రభునకే స్తోత్రం స్తోత్రం
||భూమిపై|| 

సర్వాంగ కవచము ధరియించి నే ఆత్మీయ యుద్ధము చేసెదను 
ఆకాశమండల దురాత్మలన్ యేసు నామములో ఓడించెదను
విశ్వాస డాలును చేపట్టి వాక్యాత్మ ఖడ్గము బిగబట్టి  
క్రీస్తు రక్తంపు విలువ చాట నను వాడుచున్న 
యేసు నా ప్రభునకే స్తోత్రం స్తోత్రం
||భూమిపై|| 

ప్రభు రాజ్యమున్ నితిన్ మొదటగా వెదకి అన్నింటిపొందెదను 
గురివద్దకే నే పరిగెత్తుచు నీతి కిరీటము గెలిచెదను 
నా అతిశయ కారణం ప్రభు శిలువే 
నేనేమై ఉంటినో అది ప్రభు కృపయే 
నాదు విశ్వాసమును నిరతం కాపాడుచున్న
యేసు నా ప్రభునకే స్తోత్రం స్తోత్రం
||భూమిపై|| 

---------------------------------------------------
CREDITS : Bro. M. Anil Kumar 
Album : Jesus The King Of Kings
---------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments