4039) యేసయ్యా ప్రేమామయా ఏరీతి స్తుతియింతు నీకేమి చెల్లింతు (191)

** TELUGU LYRICS **
    - జె. దేవరాజు 
    - Scale : Bm

    యేసయ్యా - ప్రేమామయా - ఏరీతి స్తుతియింతు - నీకేమి చెల్లింతు 
    పరమ తండ్రి పావనాత్మ వందన స్తుతులందుకో 

1.  ఆ నిశీధరాత్రిలో - గెత్సెమనే తోటలో 
    మరణ వేదన బాధలందు - అలసిపోతివా నా ప్రభు 
    ||యేసయ్యా||

2.  కఠిన యూదులు బట్టిరి - అకట హింసలు బెట్టిరి 
    నెపములెన్నో నేరమెంతో - మోపి నీపై ఉమిసిరా  
    ||యేసయ్యా||

3.  కరకు కొరడా దెబ్బలు - పడెను వడి నీ మేనుపై 
    చీల్చె దేహం చిందె రక్తం - మౌనివైతివా నా ప్రభూ 
    ||యేసయ్యా||

4.  నీదు సిలువ మరణమందు - నీవు కార్చిన రక్తమందు 
    నాదు పాపము పరిహరించి - నన్ను ధన్యుని జేసినావు 
    ||యేసయ్యా||

** CHORDS **

    Bm                          A            Bm    A         Bm
    యేసయ్యా - ప్రేమామయా - ఏరీతి స్తుతియింతు - నీకేమి చెల్లింతు 
              A       Bm    G          A    Bm
    పరమ తండ్రి పావనాత్మ వందన స్తుతులందుకో 

             A                   Bm
1.  ఆ నిశీధరాత్రిలో - గెత్సెమనే తోటలో 
    A             Bm                       A    Bm
    మరణ వేదన బాధలందు - అలసిపోతివా నా ప్రభు 
    ||యేసయ్యా||

2.  కఠిన యూదులు బట్టిరి - అకట హింసలు బెట్టిరి 
    నెపములెన్నో నేరమెంతో - మోపి నీపై ఉమిసిరా  
    ||యేసయ్యా||

3.  కరకు కొరడా దెబ్బలు - పడెను వడి నీ మేనుపై 
    చీల్చె దేహం చిందె రక్తం - మౌనివైతివా నా ప్రభూ 
    ||యేసయ్యా||

4.  నీదు సిలువ మరణమందు - నీవు కార్చిన రక్తమందు 
    నాదు పాపము పరిహరించి - నన్ను ధన్యుని జేసినావు 
    ||యేసయ్యా||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------