** TELUGU LYRICS **
- జి.నిరీక్షణరావు
సంఘమా - క్రైస్తవ సంఘమా
క్రీస్తేసుని ప్రియ జనాంగమా
సార్వత్రిక సంఘ రూపమా
సజీవయాత్మ మందిరమా
జయభేరి మ్రోగించు - జయ శాలి యేసేయని
మారుచున్న సమాజంలో - యేసెన్నడు మారడని
క్రీస్తేసుని ప్రియ జనాంగమా
సార్వత్రిక సంఘ రూపమా
సజీవయాత్మ మందిరమా
జయభేరి మ్రోగించు - జయ శాలి యేసేయని
మారుచున్న సమాజంలో - యేసెన్నడు మారడని
1. నిన్న నేడు మారని యేసు - ఎన్నడైనను మారని దేవుడు
కొన్నాడు నిన్ను తన రక్తంతో ఉన్నాడు నీతో సదాకాలం
||జయ||
2. కుళ్ళిపోయిన సమాజంలో - నీ సారమును విడనాడకు
నిజమైన ఉప్పు నీవే యని - క్రైస్తవ విలువలు మరువకుమా
||జయ||
3. మతము కాదది మార్గమని - మతాలన్నీ ఒకటే కాదని
మరణము గెలిచి లేచిన యేసే - నరులకు రక్షణ మార్గమని
||జయ||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------