** TELUGU LYRICS **
- జి. నీరీక్షణరావు
సాగిపొమ్ము! సాగిపొమ్ము
ఓ సోదరా! ఓ సోదరీ
ప్రభుని వాక్కు చేత బూని
విభుని ఆత్మ బలముతో
1. చూడుము నశించు ఆత్మలను
తలపోయుచు నీ దర్శనము
వేషధారణ నీకు న్యాయమా
ఎంతకాలమిల సాగెదవు
తలపోయుచు నీ దర్శనము
వేషధారణ నీకు న్యాయమా
ఎంతకాలమిల సాగెదవు
||సాగిపొమ్ము||
2. ప్రభు నిను పిలచిన పనియేదో
పరికించి చూడు నీ గురియేదో
పనుల భారము పరిత్యజించుము
ప్రభుని కాడిని మోయుచు నీవు
||సాగిపొమ్ము||
3. ప్రేషిత పిలుపుతో నీవిలలో
వీక్షించుము ప్రభుని రాకడకు
కష్టనష్టములావరించినా
దుష్టునెదరించు దీక్షబూని
||సాగిపొమ్ము||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------