4011) ప్రభువా నీదివ్యప్రేమ సకలంబిచ్చెను

** TELUGU LYRICS **

    - జె. దేవరాజు 
    - Scale : Am

    ప్రభువా నీ దివ్యప్రేమ సకలంబిచ్చెను
    విభుడా నీదు ప్రేమ సకలం మన్నించెన్
    ఆనందమే - అతిశయమే - అనిశము నీయందే
    హల్లెలూయ స్తోత్రం - ఎల్లవేళ స్తోత్రం - ఆరాధించెద యేసయ్యా

1.  ప్రాణం అర్పించావు - జీవం అందించావు
    శాపం భరించావు - పాపం క్షమించావు
    ఆశీర్వదించినావు - ఐశ్వర్యమిచ్చినావు
    వాగ్దాన సంపదలతో - వాక్యంబు నిచ్చినావు 
    ||ఆనందమే||

2.  ఆదిలో ఎరిగినావు - క్రీస్తులో ఎంచినావు 
    ప్రేమతో పిలిచినావు - నీతిగా తీర్చినావు 
    తేజోనివాసులతో - స్వాస్థ్యం నిచ్చినావు 
    మహిమావారసత్వం - మహిలో కలిగించావే
    ||ఆనందమే||

3.  నీవేచాలు ప్రభువా - నాకేమి కొదువలేదు 
    నీ ప్రేమ చాలు ప్రియుడా - నీవేగా నా సమస్తం 
    నా ఘోర పాపమంతా - నీ ప్రేమ కడిగెనయ్యా 
    నీ ప్రేమ నుండి ఎవడు - ఎడబాపలేడు నిజము
    ||ఆనందమే||

4.  వాక్యంబిచ్చినావు - నీవెలుగు నింపినావు 
    వాగ్దాన మిచ్చినావు - ఆదరణ జూపినావు 
    నా పాపమరణ నియమం - తొలగించివేసినావు 
    నీ ఆత్మజీవ నియమం - నియమించి బ్రోచినావు
    ||ఆనందమే||

** CHORDS **

    Am                 E7        Am
    ప్రభువా నీ దివ్యప్రేమ సకలంబిచ్చెను
    F             G    Em            Am
    విభుడా నీదు ప్రేమ సకలం మన్నించెన్
                          G   Dm      G    Am
    ఆనందమే - అతిశయమే - అనిశము నీయందే
                                  F                   G        Am
    హల్లెలూయ స్తోత్రం - ఎల్లవేళ స్తోత్రం - ఆరాధించెద యేసయ్యా

    F               E7  F               Am
1.  ప్రాణం అర్పించావు - జీవం అందించావు
    C            E7    F                   Am
    శాపం భరించావు - పాపం క్షమించావు
                 G                   Am
    ఆశీర్వదించినావు - ఐశ్వర్యమిచ్చినావు
                G                        Am
    వాగ్దాన సంపదలతో - వాక్యంబు నిచ్చినావు
    ||ఆనందమే||

2.  ఆదిలో ఎరిగినావు - క్రీస్తులో ఎంచినావు 
    ప్రేమతో పిలిచినావు - నీతిగా తీర్చినావు 
    తేజోనివాసులతో - స్వాస్థ్యం నిచ్చినావు 
    మహిమావారసత్వం - మహిలో కలిగించావే
    ||ఆనందమే||

3.  నీవేచాలు ప్రభువా - నాకేమి కొదువలేదు 
    నీ ప్రేమ చాలు ప్రియుడా - నీవేగా నా సమస్తం 
    నా ఘోర పాపమంతా - నీ ప్రేమ కడిగెనయ్యా 
    నీ ప్రేమ నుండి ఎవడు - ఎడబాపలేడు నిజము
    ||ఆనందమే||

4.  వాక్యంబిచ్చినావు - నీవెలుగు నింపినావు 
    వాగ్దాన మిచ్చినావు - ఆదరణ జూపినావు 
    నా పాపమరణ నియమం - తొలగించివేసినావు 
    నీ ఆత్మజీవ నియమం - నియమించి బ్రోచినావు
    ||ఆనందమే||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------