4007) ప్రభుక్రీస్తే నిజదైవము విభుడేసు సజీవుడు (161)

** TELUGU LYRICS **

    - జె. దేవరాజు 
    - Scale : Em

    ప్రభుక్రీస్తే నిజదైవము - విభుడేసు సజీవుడు - 
    అభయంబునిచ్చు నజరేయుడు 
    విభవాత్మతేజోమయుడు 

1.  అదృశ్యదైవ స్వరూపియే - ఆది స్వయం సంభవుడు 
    ఆద్యంత రహితం - అసమాన చరితం - ఆ దివ్యకాంతిని గనుమా 
    ||ప్రభు||

2.  సర్వసృష్టికి మూలం శ్రీయేసుడే - సర్వజీవుల పోషకుడు 
    సర్వమానవ పాప పరిహారము - ఉర్విన్ ప్రభుకాంతిని గనుమా 
    ||ప్రభు||

3.  కలువరి సిలువలో నింగిలో వ్రేలాడెను - విలువైన రుధిరము చిందించె 
    పలుపాపముల నెల్ల తొలగించెను - ఇలవెలసిన కాంతిని గనుమా 
    ||ప్రభు||

4.  మరణాంధకారములను తొలగించెను - పరలోక ద్వారము తెరిచె 
    చిరజీవాక్షయతల్ వెలుగొందెను - ధర పర గురు కాంతిని గనుమా 
    ||ప్రభు||

** CHORDS **

    Em        C        D                 G
    ప్రభుక్రీస్తే నిజదైవము - విభుడేసు సజీవుడు - 
    Am                    Em
    అభయంబునిచ్చు నజరేయుడు 
    D                    Em
    విభవాత్మతేజోమయుడు 

                D      Bm        D             Em
1.  అదృశ్యదైవ స్వరూపియే - ఆది స్వయం సంభవుడు 
     A                 G                 Dmaj7 D          Em
    ఆద్యంత రహితం - అసమాన చరితం - ఆ దివ్యకాంతిని గనుమా 
    ||ప్రభు||

2.  సర్వసృష్టికి మూలం శ్రీయేసుడే - సర్వజీవుల పోషకుడు 
    సర్వమానవ పాప పరిహారము - ఉర్విన్ ప్రభుకాంతిని గనుమా 
    ||ప్రభు||

3.  కలువరి సిలువలో నింగిలో వ్రేలాడెను - విలువైన రుధిరము చిందించె 
    పలుపాపముల నెల్ల తొలగించెను - ఇలవెలసిన కాంతిని గనుమా 
    ||ప్రభు||

4.  మరణాంధకారములను తొలగించెను - పరలోక ద్వారము తెరిచె 
    చిరజీవాక్షయతల్ వెలుగొందెను - ధర పర గురు కాంతిని గనుమా 
    ||ప్రభు||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments