3990) నూతన దరిశనమిమ్ము ప్రభువా (141)

** TELUGU LYRICS **

    - జి.ఎఫ్.వి.ప్రసాద్ 

    నూతన దరిశనమిమ్ము - ప్రభువా 
    నూతన పరచుము నన్ను - దేవా 

1.  పాత జీవితము - ఫలితము లేనిది 
    భారము లేనిది - భరియింప లేనిది 
    ||నూతన||

2.  నా చుట్టునున్న - నశియించుచున్న 
    నా వారలకు - సాక్షినై యుండ
    ||నూతన||

3.  దరిశనము లేక - నశియించు నాత్మలు 
    దరిశన మిమ్ము- నీకై నిలువ
    ||నూతన||

4.  నూతన ఆయుధ - ముగ నను జేయుము 
    జ్ఞానాత్మా - ఓ జీవదాయకా
    ||నూతన||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------