** TELUGU LYRICS **
- డి. సుందరదాసు
- Scale : D
- Scale : D
లోకమునకు ఉప్పు - లోకమునకు వెలుగు
ఈ లోకంలో ఉంచెను మనను - యేసు ఉంచెను
1. మనుష్యుల ఎదుట మన వెలుగును ప్రకాశింప జేసి
మన తండ్రిని మహిమ పరిచి - సత్త్రియలను చూపుదాం
2. సమాధానముతో యుండెదం మనమందరము
మంచితనము నీతి సత్యము - కనబడ జేయుదుము
3. ఉప్పు సారము అగ్ని వలన కలుగును ప్రతి వానికి
మన సంభాషణ ఎల్లప్పుడునూ - రుచిగా నుంచుదాం
4. నిష్ఫలమైన చీకటి క్రియలలో పాలు పొందక ఖండించెదం
ప్రభువుకు ఏది ప్రీతికరమో దానిని చేపట్టేదం
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------