3936) జీవము నీవే నాకై చావగ నాపాపంబది ఎంతో ఘోరం దేవా (72)

** TELUGU LYRICS **

    - జె. దేవరాజు 
    - Scale : C

    జీవము నీవే నాకై చావగ - నాపాపంబది ఎంతో ఘోరం దేవా 
    తలచితిని వగచితిని - నను కరుణించుము నాధా దేవా (2) 

1.  పరిశుద్ధుడవు పావన చరితుడ - పలునింద పాలైనావా 
    ఖలుడను నేను కడు చంచలుడను - విలువైన నీ దేహం సిలువకు గొట్టితి 
    ||జీవము||

2.  నాతండ్రీ ఈ పాత్రను నానుండి - తొలగించండని వేడేవా 
    వేదన హెచ్చి నీమది కృంగి - దేహం చిందెనా స్వేదం రుధిరం 
    ||జీవము||

3.  నాదేవా నాదేవా నన్నేల - విడనాడితి వన్నావా 
    నాకలుషంబు కఠిన చీకటిగ - క్రమ్మెనా నిన్ను కలువరి లోన 
    ||జీవము||

4.  దప్పిగొనుచున్నానని పలికి - లేఖనమే నెరవేర్చావా 
    నా వ్యామోహం, దోషాదాహం - దీరని దాహమై నిను వేధించె 
    ||జీవము||

** CHORDS **

      C        Am          C                  Bb        C
    జీవము నీవే నాకై చావగ - నాపాపంబది ఎంతో ఘోరం దేవా 
            F         C            Bb               C
    తలచితిని వగచితిని - నను కరుణించుము నాధా దేవా (2) 

      C                    Bb                    C
1.  పరిశుద్ధుడవు పావన చరితుడ - పలునింద పాలైనావా 
     F                                  C                Bb        C
    ఖలుడను నేను కడు చంచలుడను - విలువైన నీ దేహం సిలువకు గొట్టితి 
    ||జీవము||

2.  నాతండ్రీ ఈ పాత్రను నానుండి - తొలగించండని వేడేవా 
    వేదన హెచ్చి నీమది కృంగి - దేహం చిందెనా స్వేదం రుధిరం 
    ||జీవము||

3.  నాదేవా నాదేవా నన్నేల - విడనాడితి వన్నావా 
    నాకలుషంబు కఠిన చీకటిగ - క్రమ్మెనా నిన్ను కలువరి లోన 
    ||జీవము||

4.  దప్పిగొనుచున్నానని పలికి - లేఖనమే నెరవేర్చావా 
    నా వ్యామోహం, దోషాదాహం - దీరని దాహమై నిను వేధించె 
    ||జీవము|| 

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali