3934) జయమని పాడెదము యేసుని చాటెదము (68)

** TELUGU LYRICS **

    - డా.వై.బాబ్జీ
    - Scale : G

    జయమని పాడెదము - యేసుని చాటెదము 
    లోకమునంతటిని - ప్రేమతో గెలిచెదము 
    యేసే క్రీస్తని, క్రీస్తే ప్రభువని - పాపుల రక్షకుడని 
 
    ||జయ||

1.  నరరూపధారియై - భువి నుదయించెను 
    నరులను రక్షింప - మరణము నొందెను  
    మూడవ దినమున - మృత్యుంజయుడాయెన్ 
    ముదమున పాడెదము - హల్లెలూయగీతముల్
    ||జయ||

2.  నూతన సృష్టిగా - మనలను చేసెను 
    నూతన గీతమున్ - మన నోట నుంచెను 
    పరిశుద్ధాత్ముని - వరముగ నొసగెను 
    పాడి పొగెడెదము - ప్రభువును మనసార
    ||జయ||

3.  శుభప్రద నిరీక్షణ - మరి మనకొసగెను 
    శుభవార్త ప్రకటించే - శిష్యులుగ చేసెను 
    అభయప్రదాతయై - మనతో నుండెను 
    అనిశము పొగడెదము - అరమరికలు లేక
    ||జయ||

** CHORDS **

        G                
    జయమని పాడెదము - యేసుని చాటెదము 
            C
    లోకమునంతటిని - ప్రేమతో గెలిచెదము 
           D7                          G        C-G
    యేసే క్రీస్తని, క్రీస్తే ప్రభువని - పాపుల రక్షకుడని
    ||జయ||

            Em                   D
1.  నరరూపధారియై - భువి నుదయించెను 
                        D7       G       G7
    నరులను రక్షింప - మరణము నొందెను  
             C                    G
    మూడవ దినమున - మృత్యుంజయుడాయెన్ 
                D                       G
    ముదమున పాడెదము - హల్లెలూయగీతముల్
    ||జయ||

2.  నూతన సృష్టిగా - మనలను చేసెను 
    నూతన గీతమున్ - మన నోట నుంచెను 
    పరిశుద్ధాత్ముని - వరముగ నొసగెను 
    పాడి పొగెడెదము - ప్రభువును మనసార
    ||జయ||

3.  శుభప్రద నిరీక్షణ - మరి మనకొసగెను 
    శుభవార్త ప్రకటించే - శిష్యులుగ చేసెను 
    అభయప్రదాతయై - మనతో నుండెను 
    అనిశము పొగడెదము - అరమరికలు లేక
    ||జయ||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------