** TELUGU LYRICS **
- డి. రాము
- Scale : Em
- Scale : Em
ఎవరైనను యేసయ్యను వెంబడింపగోరిన
జీవితాంతము సిలువ మోయుచు వెంబడింపవలెను
క్రమముతో - శ్రమలలో
శోధనలలో - బాధలలో
వెంబడింపవలెను - యేసయ్యను - వెంబడింపవలెను (2)
1. హృదయ మందు ప్రథమ స్థానం - ప్రభువు కీయుమా (2)
వ్యధల యందు ముదముతో - పౌలువలె సాగుమా
వ్యధల యందు ముదముతో - పౌలువలె సాగుమా
||ఎవరైన||
2. అంధత్వమున నున్న విద్యార్థులకై - ముందుకు సాగుమా (2)
డెందమున ఆనందమిచ్చే - యేసుని చాటుమా (2)
||ఎవరైన||
3. రయమున నీవు భయభక్తులతో సాగిపోవుమా (2)
లోయలైనా ఆయాసమైనా - వెనుక తీయకుమా (2)
||ఎవరైన||
4. ప్రార్థన లేని నీ పరిచర్య - ఫలము నీయదుగా (2)
వ్యర్థమయ్యే విద్యార్థులకై - కన్నీరు కార్చుమా (2)
||ఎవరైన||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------