3941) ద్రాక్షవల్లి ప్రభుయేసే తీగవలె నేనుందును (82)

** TELUGU LYRICS **

    - జె.వి. పద్మలత 
    - Scale : F#m

    ద్రాక్షవల్లి - ప్రభుయేసే 
    తీగవలె - నేనుందును 
    ఫలియింపని ప్రతి తీగెను పారవేయున్ 
    పరలోకమునకు రానియ్యడు 
    హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా.. ఆమెన్. హల్లెలూయా 

1.  గొప్ప విశ్వాసముతో హెబేలు. 
    పరిశుద్ధ దేవునితో మాట్లాడెను 
    హెబేలు వలె విశ్వాసముతో (2) 
    పరిశుద్ధ దేవునితో మాట్లాడెదన్ 
    ||హల్లెలూయా||
 
2.  మరణము లేకయే హనోకు 
    నడిచెను దేవునితో విశ్వాసముతో 
    హనోకు వలె విశ్వాసముతో (2) 
    దేవునితో నేను నడిచెదను
    ||హల్లెలూయా||

3.  దేవుని మాటకు లోబడి నోవాహు 
    నిర్మించెను ఓడను విశ్వాసముతో 
    నోవాహు వలె విశ్వాసముతో (2) 
    దేవుని మాటకు నేను లోబడెదను
    ||హల్లెలూయా||

4.  విశ్వాసుల తండ్రి అగు అబ్రాహాము 
    నిరీక్షణతో బయలు దేరెను 
    అబ్రాహామువలె నిరీక్షణతో (2) 
    దేవునితో నేను సాగెదను
    ||హల్లెలూయా||

5.  దేవుని పిలుపుననుసరించి మోషే 
    నడిపించెను ప్రజలను విశ్వాసముతో 
    మోషేవలె విశ్వాసముతో (2) 
    దేవుని పిలుపు ననుసరించెదను
    ||హల్లెలూయా||

6.  విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తే 
    దానిని కొనసాగించే యేసుని వైపు చూస్తూ 
    మన యెదుట ఉంచబడినా పందెములో (2) 
    ఓపికతో నేను పరుగెత్తెదన్
    ||హల్లెలూయా||

** CHORDS **

    F#m              E
    ద్రాక్షవల్లి - ప్రభుయేసే 
         Bm    C#7   F#m
    తీగవలె - నేనుందును 
    ఫలియింపని ప్రతి తీగెను పారవేయున్ 
    పరలోకమునకు రానియ్యడు 
                            E              Bm          C#7       F#m
    హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా.. ఆమెన్. హల్లెలూయా 

          E                F#m
1.  గొప్ప విశ్వాసముతో హెబేలు. 
             E                F#m
    పరిశుద్ధ దేవునితో మాట్లాడెను 
                             E
    హెబేలు వలె విశ్వాసముతో (2) 
                       C#7
    పరిశుద్ధ దేవునితో మాట్లాడెదన్
    ||హల్లెలూయా||
 
2.  మరణము లేకయే హనోకు 
    నడిచెను దేవునితో విశ్వాసముతో 
    హనోకు వలె విశ్వాసముతో (2) 
    దేవునితో నేను నడిచెదను
    ||హల్లెలూయా||

3.  దేవుని మాటకు లోబడి నోవాహు 
    నిర్మించెను ఓడను విశ్వాసముతో 
    నోవాహు వలె విశ్వాసముతో (2) 
    దేవుని మాటకు నేను లోబడెదను
    ||హల్లెలూయా||

4.  విశ్వాసుల తండ్రి అగు అబ్రాహాము 
    నిరీక్షణతో బయలు దేరెను 
    అబ్రాహామువలె నిరీక్షణతో (2) 
    దేవునితో నేను సాగెదను
    ||హల్లెలూయా||

5.  దేవుని పిలుపుననుసరించి మోషే 
    నడిపించెను ప్రజలను విశ్వాసముతో 
    మోషేవలె విశ్వాసముతో (2) 
    దేవుని పిలుపు ననుసరించెదను
    ||హల్లెలూయా||

6.  విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తే 
    దానిని కొనసాగించే యేసుని వైపు చూస్తూ 
    మన యెదుట ఉంచబడినా పందెములో (2) 
    ఓపికతో నేను పరుగెత్తెదన్
    ||హల్లెలూయా||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------