3947) దేవుని యెదుట యోగ్యునిగా నీవు ఎప్పుడు కనబడుమా (89)

** TELUGU LYRICS **

    - కె. జె. యస్. బాబురావు 
    - Scale : Cm

    దేవుని యెదుట యోగ్యునిగా నీవు ఎప్పుడు కనబడుమా 
    బ్రోవగ నశించు ఆత్మలను, దైవవాక్కుతో సిద్ధపడుమా 

1.  అబ్రహాము వంటి విశ్వాసము, యోసేపు వంటి పవిత్రత 
    మోషేవంటి నమ్మకత్వము, యోహాను వంటి స్థిర నిర్ణయం 
    యోబు వంటి భయభక్తులు - దానియేలు వంటి దైవజ్ఞానం 
    నీకు కూడా కావాలి, నీవు ఇంకా మారాలి 

2.  అపోస్తలుల పరిచర్య, పౌలు చేసిన పానార్పణ 
    తిమోతిలోని వినే మనస్సు, ఎపఫ్రా చేసిన ప్రార్థనలు 
    యేసుప్రభుని దీనత్వం, తండ్రి దేవుని వాత్సల్యం 
    గడి నీకు కూడా కావాలి, నీవు ఇంకా మారాలి 

3.  మాటలలో, విశ్వాసములో, ప్రవర్తనలో, పవిత్రతలో 
    ప్రేమలో మరి అన్నిటిలో మాదిరి నీవు చూపాలి 
    సిగ్గుపడని పని వానిలా సత్యవాక్యము సరిగాను 
    నీకు కూడా కావాలి, నీవు ఇంకా ఎదగాలి 

** CHORDS **

    Cm                          A#            Cm
    దేవుని యెదుట యోగ్యునిగా నీవు ఎప్పుడు కనబడుమా 
     Cm                          A#        Cm
    బ్రోవగ నశించు ఆత్మలను, దైవవాక్కుతో సిద్ధపడుమా 

     Cm            A#                          Cm
1.  అబ్రహాము వంటి విశ్వాసము, యోసేపు వంటి పవిత్రత 
     Cm       A                                    Cm
    మోషేవంటి నమ్మకత్వము, యోహాను వంటి స్థిర నిర్ణయం 
                           A#    G#                      Cm
    యోబు వంటి భయభక్తులు - దానియేలు వంటి దైవజ్ఞానం 
                 G    Cm          G    Cm
    నీకు కూడా కావాలి, నీవు ఇంకా మారాలి 

2.  అపోస్తలుల పరిచర్య, పౌలు చేసిన పానార్పణ 
    తిమోతిలోని వినే మనస్సు, ఎపఫ్రా చేసిన ప్రార్థనలు 
    యేసుప్రభుని దీనత్వం, తండ్రి దేవుని వాత్సల్యం 
    గడి నీకు కూడా కావాలి, నీవు ఇంకా మారాలి 

3.  మాటలలో, విశ్వాసములో, ప్రవర్తనలో, పవిత్రతలో 
    ప్రేమలో మరి అన్నిటిలో మాదిరి నీవు చూపాలి 
    సిగ్గుపడని పని వానిలా సత్యవాక్యము సరిగాను 
    నీకు కూడా కావాలి, నీవు ఇంకా ఎదగాలి 

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments