3948) దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది (90)

** TELUGU LYRICS **

    - Scale : Em 
    
    దేవుని కొరకు నా ప్రాణము - తృష్ణగొనుచున్నది 
    దుప్పి నీటి వాగులకై - ఆశపడునట్లుగా 
    ఆదరణ, ఆనందము - ఆయనలో అనుదినము 

1.  దేవుని సన్నిధికి - నేనెప్పుడు వత్తునని 
    నిరతము ఆయన ప్రేమకొరకై - దాహము గొనుచున్నది 
    ||ఆదరణ||

2.  మరణపు పాశములు - నను చుట్టుకొని యుండగా 
    విడిపించి జీవములోనికి - నన్ను నడిపించెను యేసు 
    ||ఆదరణ||

3.  దివారాత్రములు - దైవ వాక్యధ్యానము కొరకై 
    ప్రార్ధన సహవాసంబు కొరకై - ఆకలి గొనుచున్నది 
    ||ఆదరణ||

4.  భక్తి హీనుడనైయుండ - బలహీనుడనై యుండగా 
    ఆత్మాభిషేకము నిచ్చి క్రీస్తు - సాక్షిగా జేసె నన్ను 
    ||ఆదరణ||

5.  పాపులన్ పరికింపగా - నాలో ప్రసవ వేదన కలిగె 
    ఆత్మలన్ సంపాదించవలెనను - దాహము గొనుచున్నది 
    ||ఆదరణ||

6.  హల్లెలూయ స్తోత్రముల్ - ప్రభు యేసునకే మహిమ 
    నిరతము స్తుతులు కీర్తి ఘనత - ఆయన నామముకే 
    ||ఆదరణ||

** CHORDS **

    Em    C        Em                        D
    దేవుని కొరకు నా ప్రాణము - తృష్ణగొనుచున్నది 
    Em   B    Am C   B7       Em
    దుప్పి నీటి వాగులకై - ఆశపడునట్లుగా 
          D            C  B7         Em
    ఆదరణ, ఆనందము - ఆయనలో అనుదినము 

    Em               D     C        D    Em
1.  దేవుని సన్నిధికి - నేనెప్పుడు వత్తునని 
    Am               C   D      B7                Em
    నిరతము ఆయన ప్రేమకొరకై - దాహము గొనుచున్నది 
    ||ఆదరణ||

2.  మరణపు పాశములు - నను చుట్టుకొని యుండగా 
    విడిపించి జీవములోనికి - నన్ను నడిపించెను యేసు 
    ||ఆదరణ||

3.  దివారాత్రములు - దైవ వాక్యధ్యానము కొరకై 
    ప్రార్ధన సహవాసంబు కొరకై - ఆకలి గొనుచున్నది 
    ||ఆదరణ||

4.  భక్తి హీనుడనైయుండ - బలహీనుడనై యుండగా 
    ఆత్మాభిషేకము నిచ్చి క్రీస్తు - సాక్షిగా జేసె నన్ను 
    ||ఆదరణ||

5.  పాపులన్ పరికింపగా - నాలో ప్రసవ వేదన కలిగె 
    ఆత్మలన్ సంపాదించవలెనను - దాహము గొనుచున్నది 
    ||ఆదరణ||

6.  హల్లెలూయ స్తోత్రముల్ - ప్రభు యేసునకే మహిమ 
    నిరతము స్తుతులు కీర్తి ఘనత - ఆయన నామముకే 
    ||ఆదరణ||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------