3831) వందనం యేసయ్యా నీ ప్రేమకు వందనం

  

** TELUGU LYRICS **

    వందనం యేసయ్యా నీ ప్రేమకు వందనం
    వందనం మెస్సయ్యా నీ కృపకు అభివందనం
    వందనం వందనం వందనం మెస్సయ్యా

1.  దేవుని సన్నధినుండి చంటి బిడ్డ లా జన్మించి 
    భువిని అబ్బుర పరిచిన మా చిన్ని యేసయ్యా 
    మనుష్య కుమారునిగా జీవించి యుక్తముగా సూక్తులు నేర్పిన 
    యోగ్యత లేని అజ్ఞానుల మధ్య వాక్య విలువను నేర్పిన భోదకుడ

2.  పాపము నేర్చిన లోకముకు విడుదల యోచించిన రక్షకుడా 
    బాధల నడుమ సిలువను మోసిన మా యేసయ్యా
    సిలువలో మాకై రక్తము కార్చిన మహోన్నతుడవు యేసయ్యా
    యోగ్యతతో నిబంధన చేసి 
    నీ ఆత్మ తో మము నింపిన దేవా ! 
    వందనం వందనం వందనం మెస్సయ్యా..

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------