3830) బెత్లహేములో పశుల పాకలో నజరేతు అను ఊరిలో

    

** TELUGU LYRICS **

    బెత్లహేములో పశుల పాకలో - నజరేతు అను ఊరిలో (2)
    యేసయ్య జన్మించినాడురా
    దావీదు పట్టణము నందునా
 (2)
    అను.ప: రారండి వేడుక చేద్దాం లోక రక్షకుడు వచ్చాడని రారాజు జన్మించాడని
 (2)

1.  కన్య మరియ గర్భమందునా - బాలయేసు జన్మించెను (2)
    దీనులను కరుణించుటకు - పాపులను రక్షించుటకు
    గొప్ప దేవుడు నీతిమంతుడు - 
    పాపం ఎరుగని పరిశుద్ధుడు మన రాజుల రాజు యేసు దేవుడు
    పరిశుద్ధాత్మతో జన్మించెను 
    ||రారండి||

2   దైవ తనయుడు యేసు - మనలను రక్షించవచ్చెను.
    ఈ లోకాన్ని వెలిగించుటకు - గొప్ప రక్షణను మనకిచ్చుటకు
 (2)
    ప్రేమమయుడు కరుణామయుడు - జాలి గల దైవం అరుదించెను
    పరమ వైద్యుడు పావనుడు మనుజావతారుడై ఉదయించెను
 (2)
    ||రారండి||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------