3829) దైవకుమారుడే దీనుడైన వేళ దిక్కులేని మనపై దయను చూపిన వేళ

    

** TELUGU LYRICS **

    దైవకుమారుడే దీనుడైన వేళ
    దిక్కులేని మనపై దయను చూపిన వేళ
    సంబరమాయెనె మది మురిసిపోయెనె
    ఆనందమె సంతోషమే హృదిలొ నిండెనె
    ఇహమందు పరమందు స్తుతి ఆరాధనె

1  కారుచీకటి కమ్మిన ఈ భువిలోన
    అద్భుతమైన దీపమై వెలుగు విరజిమ్మెనుగా
    ఆ వెలుగె నిన్ను నన్ను ప్రకాశింపజేసెనుగా
    మన అందరి జీవితాలలో సంతోషము నింపెనుగా

2  ప్రవచింపబడెను ముందుగానే రక్షకుడు పుట్టునని
    లేఖనాలు నెరవేర్చు పుట్టెనేసు మురిసెను ఈ ధరణి
    చెప్పినట్టుగానే ప్రతి మాటను నెరవేర్చెను నా బ్రతుకలో
    ప్రతి పాపపు బంధకాలనుండి విడిపించె ఆ సిలువలో

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------