** TELUGU LYRICS **
సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతమువరకు కాచావు (2)
కనుపాపవలె కాచి నీ కౌగిలిలో చేర్చి (2)
కాచావు, భద్రపరిచావు, కృపచూపావు, వందనం
కాచావు, భద్రపరిచావు, బ్రతికించావు, వందనం
అ.ప: నీవే లేక ఒక క్షణమైనా నే బ్రతుకలేనే
నీవేలేని ఒక అడుగైనా నే వేయలేనే
1. కన్నీళ్లలో కష్టాలో కడగండ్లలో కృంగిన వేళలో (2)
నన్ను ఆదరించావు నా చెంత నిలిచావు
ఆదుకున్నావు కన్నీరు తుడిచావు (2)
||నీవేలేక||
2. ఆరోగ్యమే క్షీణించగా, ఆవేదనే ఆవరించగా (2)
నన్ను స్వస్థపరిచావు నీ శక్తినిచ్చావు లేవనెత్తావు..
ఆయుష్షు పెంచావు (2)
||నీవేలేక||
3. సంవత్సరములు జరుగుచుండ, నీ కార్యములు నూతనపరచుము (2)
మహాకార్యములను జరిగించుము
మహాభీకరుండ మహిమరాజా (2)
||నీవేలేక||
4. ప్రభువా దేవా ఈ జీవితం, నీ పాదసేవకే ఇల అంకితం (2)
సమాధానవార్తను ప్రకటింతును
భీకరకార్యములను జరిగింతును (2)
భీకరకార్యములను జరిగింతును (2)
||నీవేలేక||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------