3849) గతకాలం కాచిన దేవా నా యేసు దేవా

    

** TELUGU LYRICS **

    గతకాలం కాచిన దేవా నా యేసు దేవా 
    నీ ప్రేమ కౌగిలిలోన నను దాచుకున్నవా (2)

1.  నా కంటే గొప్పవారు ఘనులైన వారు 
    కాల గర్భములోనే కలిసిపోయారు (2)
    ఎట్టి యోగ్యతా లేని నన్ను నీవు యేసయ్యా  
    నీ కృపతో నన్ను కాచి నడిపించావు (2) 
    ||గత||

2.  నా కంటే మంచివారు బలమైన వారు       
    మరనమై స్మరణకు రాకుండా పోయారు (2)
    ఎట్టి అర్హతా లేని నన్ను నీవు యేసయ్యా 
    నీ దయతో నన్ను ఆయుష్షుతొ నింపావు (2) 
    ||గత||

3.  నా కంటే వున్న వారు అందమైన వారు 
    గడ్డిపువ్వు వలెనే వాడిపోయారు (2)
    ఎట్టి ఎన్నికా లేని నన్ను నీవు యేసయ్యా 
    నీ ప్రేమతో  నన్ను దీవెనతో నింపావు (2) 
    ||గత||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments