3868) క్రొత్త కీర్తన పాడెద నా యేసయ్య స్తోత్ర గానము చేసెద నా యేసయ్య


** TELUGU LYRICS **

క్రొత్త కీర్తన పాడెద - నా యేసయ్య 
స్తోత్ర గానము చేసెద - నా యేసయ్య 

నిన్ను గూర్చి - నే పాడెద 
నీ ప్రేమ గూర్చి - నే చాటెద 

హోసన్నా హోసన్నా హోసన్నా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 

నా నోటిలో నీ సాక్ష్యము 
నా మనసులో నీ ధ్యానము 
నా ఇంటి రక్షణ గానం 
నా గుమ్మములో నీ వాక్యం 

నాకు ఎంతో క్షేమము 
మాకు అదియే భాగ్యము 

క్రొత్త కీర్తన పాడెద - నా యేసయ్య 
స్తోత్ర గానము చేసెద - నా యేసయ్య 

నిన్ను గూర్చి నే పాడెద 
నీ ప్రేమ గూర్చి నే చాటెద 

హోసన్నా హోసన్నా హోసన్నా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 

నా గృహమే నీ ఆలయము 
నీ సన్నిధియే నా స్వాస్థ్యము 
నా బిడ్డలా స్తోత్ర గానము 
నా కుటుంబ ప్రార్ధన సమయం 

నాకు ఎంతో క్షేమము 
మాకు అదియే భాగ్యము 

క్రొత్త కీర్తన పాడెద - నా యేసయ్య 
స్తోత్ర గానము చేసెద - నా యేసయ్య 

నిన్ను గూర్చి నే పాడెద 
నీ ప్రేమ గూర్చి నే చాటెద 

హోసన్నా హోసన్నా హోసన్నా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 

-------------------------------------------------------------------
CREDITS : రచన : డా|| పి.సతీష్ కుమార్ గారు
స్వరకల్పన : బ్రదర్ సునీల్, 
సంగీతం: బ్రదర్ సందీప్ కుమార్ 
-------------------------------------------------------------------