3869) జీవితమంతా నీకె అర్పింతును యేసయ్య


    
** TELUGU LYRICS **

    జీవితమంతా నీకె అర్పింతును యేసయ్య
    నేనే మార్గం నేనే సత్యం అన్నావు ప్రభువా

1.  బాధలలో బంధువులా ఆదరించావు.
    శోధనలో తండ్రిలా ఆదుకున్నావు (2)
    నా కన్నీరంతా తుడిచావు నీకృపతో నన్ను పిలిచావు
(2)
    నా తండ్రి యేసయ్య నీకు నా వందనం.
 
2.  సాయం చేసే వారున్నారని ఎన్నో కలలు కన్నాను
    చివరికి ఆశలు నిరాశలై మోడుగమిగిలాను
(2)
    నా ఆశలన్ని తీర్చావు సంతోషం కలిగించావు
(2)
    నా తండ్రి యేసయ్య నీకు నా వందనం.

3.  నా తల్లిదండ్రులు చిన్నప్పుడే నాకు దూరమయ్యారు.
    ఆదరించే వారు లేక అనాధనయ్యాను
(2)
    నా బాదలన్ని తీర్చావు నీ కౌగిటిలో నను దాచావు
    నా బాదలన్ని తీర్చావు బంధుత్వం కలిగించావు
    నా తండ్రి యేసయ్య నీక నా వందనం

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------