3823) ఆ రాత్రిలో నింగిలో ఒక తార గొప్ప తేజముతో ప్రభవించెను ఆ రేయి

    

** TELUGU LYRICS **

    ఆ రాత్రిలో నింగిలో ఒక తార 
    గొప్ప తేజముతో ప్రభవించెను ఆ రేయి 
    జ్ఞానులు కనుగొనిరి - ఓర్పుతో ఆ తారను వెంబడించి చేరెను బేత్లెహేముకు 

1.  ఆ కాలములో ఉన్న జ్ఞానులు - ఖగోళ వింతను వీక్షించిరి 
    ఏదో జరిగెనని ఈ లోకంలో - అన్వేషించుచు చేరెను బెత్లేహెం 
    యూదుల రాజైన - యేసుక్రీస్తును 
    దర్శించి పూజించి ఆరాధించిరి 
    బంగారం సాంబ్రాణి బోళమునర్పించిరి 

2.  ఆ కాలములో ఉన్న గొల్లలు - రాత్రిజామున మందను కాయుచుండగా  
    దేవుని దూతోకటి తెలిపెను శుభవార్త - రక్షకుడేసుని చూచిరి గొల్లలు 
    లోక రక్షకుడు యేసు క్రీస్తును 
    కనులారా వీక్షించి సంతోషించిరి 
    చూచినవి అందరికి చాటించిరి 

3.  ఆ కాలములో దూత గణములు - పరలోకమునుండి భువికేతెంచుచు  
    సర్వోన్నతమైన స్థలములలో నేడు - దేవునికి మహిమ కలుగును గాక
    ఆయనకిష్టులైన మనుష్యులకు భువిపై - సమాధానము అనుచు దూతలు పాడిరి 
    గొర్రెల కాపరులు త్వరపడి వెళ్లిరి 
    బేత్లెహేము గ్రామములో - పశువుల పాకలో 
    కనులారా బాలుడను - చూచిరి గొల్లలు 

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------