3822) క్రిస్మస్ వచ్చింది సందడే సందడి క్రీస్తేసు పుట్టాడు భువిఅంతా సందడి

    

** TELUGU LYRICS **

    క్రిస్మస్ వచ్చింది సందడే సందడి
    క్రీస్తేసు పుట్టాడు భువిఅంతా సందడి (2)
    రండి రారండి మనమంతా కలిసి 
    క్రీస్తేసుని ఆరాధన చేద్దాము చేరి (2)
    సందడే సందడి ఈ లోకాన సందడి
    సందడి సందడి సందడి మన బ్రతుకుల్లో సందడి (2) 
    ||క్రిస్మస్||

1.  క్రిస్మస్ అంటేనే కేకులు కాదండి
    క్రిస్మస్ అంటేనే గిఫ్టులు కాదండి (2)
    క్రీస్తేసు దేవుడై నరరూపిగా వచ్చెను
    లోకాన మానవుల పాపములు మోసెను
    తెలుసుకొని రక్షకునిగా క్రీస్తేసుని చేర్చుకో
    హృదయములో నేడే నీవు ఆనందం నింపుకో
    సందడే సందడి ఈ లోకాన సందడి
    సందడి సందడి సందడి మన బ్రతుకుల్లో సందడి (2)
    ||క్రిస్మస్||

2.  క్రిస్మస్ అంటేనే క్రిస్మస్ ట్రీ కాదండి
    క్రిస్మస్ అంటేనే శాంటా కాదండి (2)
    క్రీస్తేసు కల్వరిలో రక్తమంతా కార్చెను
    మూడవ రోజున తిరిగి మన కొరకై లేచెను
    జీవించువాడని ఈ సత్యం తెలుసుకో
    చాచిన చేతులు నీకని విశ్వాసముంచుకో
    సందడే సందడి ఈ లోకాన సందడి
    సందడి సందడి సందడి మన బ్రతుకుల్లో సందడి (2)
    ||క్రిస్మస్||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments